వాలీబాల్ క్రీడలకు ఐదవ బెటాలియన్ కానిస్టేబుల్స్ ఎంపిక..

01-11-2026 | 08:05pm

గోవిందరావుపేట, నవంబర్ 1 (విజయక్రాంతి): 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు వాలీబాల్ విభాగంలో వరంగల్ రేంజ్ వన్ వాలీబాల్ జట్టు తరపున ములుగు(Mulugu) జిల్లా చలువాయి 5వ బెటాలియన్ కీ చెందిన ముగ్గురు పోలీస్ క్రీడాకారులు ఎంపిక అవడం జరిగింది.

ఈ నెల నవంబర్ 3 నుండి 5 వరకు హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహించు క్రీడల్లో వీరు పాల్గొనడం జరుగుతుంది. పాల్గొనే వారిలో కె. సాంబశివరావు హెడ్ కానిస్టేబుల్ - 68 పి.విక్రమ్ పిసి -1384 బి.రాంప్రసాద్ పిసి -1067లు ఎంపిక అయ్యారు. వీరిని 5వ బెటాలియన్ కమాండంట్ లక్ష్మీ కాంత్,  అసిస్టెంట్ కమాండంట్లు, ఆర్ఐ లు, ఆర్ఎస్ఐలు, తోటి బెటాలియన్ పోలీసు సిబ్బంది అందరూ అభినందించడం జరిగింది.

మరిన్ని వార్తలు