ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

01-11-2026 | 07:55pm

జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

ములుగు, నవంబర్ 1 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు(District Collector Borkhade Hemant Sahadevarao) ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ములుగు ఆర్డీవో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లా పరిధిలో జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ డివిజన్ అధికారులు, మండల  స్థాయిలో మండల స్థాయి అధికారులు ప్రజావాణి నిర్వహించాలని ఈ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు