వ్యవసాయ బావి వద్ద యువకుడి ఆత్మహత్య

01-11-2026 | 08:22pm

జనగామ, నవంబర్ 1 (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) లింగాల ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గర్వందుల కృష్ణ(28) ఆదివారం వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు