నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి

02-11-2026 | 09:42pm

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణ ప్రజలకు ప్రతిరోజూ నిరంతరాయంగా, సక్రమంగా త్రాగునీటి సరఫరా అందించేందుకు నీటి సరఫరా(Water Supply) విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ పురపాలక సంఘం కమిషనర్ గోపు గంగాధర్(Banswada Municipal Commissioner Gopu Gangadhar) సూచించారు. సోమవారం పట్టణ శివారులోని ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగాధర్ నీటి సరఫరా సిబ్బందికి పలు సూచనలు జారీ చేస్తూ, పట్టణంలోని అన్ని వార్డులకు నిర్ణీత సమయానికి సక్రమంగా నీటి సరఫరా జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

నీటి సరఫరా పైపులైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, ఎక్కడైనా లీకేజీలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టాలి.పైపులైన్ లీకేజీల కారణంగా త్రాగునీరు వృథాగా పోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.మోటార్లు, పంప్ హౌస్‌లు, వాల్వులు మరియు ఇతర నీటి సరఫరా పరికరాలను నిరంతరం పర్యవేక్షించాలి.నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.

నీటి సరఫరాకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలి. నీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. త్రాగునీటిని ఇతర అవసరాలకు వృథా చేయకుండా ప్రజలకు సూచించాలని తెలియజేయడం జరిగినది.  కావున నీటి సరఫరా విభాగం సిబ్బంది పై సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ, బాన్సువాడ పట్టణ ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా అందేలా సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ గారు ఆదేశించారు.

మరిన్ని వార్తలు