ఇంట్లో దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు
బెల్లంపల్లి: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో దొంగతనం చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బెల్లంపల్లి ఒకటో పోలిస్టేషన్ ఎస్ హెచ్ వో కె. శ్రీనివాసరావు సంఘటన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ కి చెందిన కొత్తపల్లి అర్జున్ ఈ నెల 23న కుటుంబంతో బంధువుల ఇంటికి వెళ్తూ ఇంటికి తాళం వేసి పక్కింటి వ్యక్తి మోబిన్ కు చెప్పి వెళ్ళాడు.
27 న తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన మోబిన్, ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు. అర్జున్ ఇంటికి వచ్చి చూడగా, బీరువాలోని 3 తులాల వెండి చేతి బ్రాస్లెట్, 8 తులాల కాళ్ల పట్టీలు, మొత్తం 13 తులాల వెండి (విలువ రూ.6,500) నగదు రూ.3,000 చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే గురువారం పోచమ్మ చెరువు కొట్ట దగ్గర వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు.
వారిని విచారించగా సుమారుగా 13 తులాల వెండి వస్తువులను వారి నుంచి రికవరీ ఈ ఘటనలో పోలీసులకు దొరికిన యూనస్ షేక్,మరో నిందితుడు గౌస్ బాబా పోలీసులకు పట్టుపడ్డారు. మరో నిందితుడు భగత్ సింగ్ నగర్ బీజోన్ కు చెందిన దాసరి కళ్యాణ్ పరారీలో ఉన్నాడని ఎస్ హెచ్ ఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్ చేశారు.