దుర్గామాత రూపంలో గణపేశ్వరుడు

19-10-2026 | 06:31pm

కోటగుళ్లలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అలంకరణ

గణపురం, అక్టోబర్ 19 (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం(Sri Bhavani Sahita Ganapeshwara Temple) కోటగుళ్లలో నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం గణపేశ్వరుడిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దుర్గామాత రూపంలో దర్శనమిస్తున్న గణపేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అభిషేకం, అర్చన, హారతులు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా కోటగుళ్లలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు