ఇందిరాగాంధీ త్యాగాలు దేశానికి స్ఫూర్తిదాయకం

31-10-2026 | 06:14pm

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి/రేగొండ,(విజయక్రాంతి): మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ(Indira Gandhi) వర్ధంతి సందర్భంగా రేగొండ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆమె చేసిన కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం సవాళ్లను ఎదుర్కొని, చివరకు ప్రాణత్యాగం చేసిన మహానేత ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇందిరాగాంధీ సేవలను స్మరించుకున్నారు.

మరిన్ని వార్తలు