తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు పతకాలు

05-10-2026 | 07:39pm

అభినందించి, వారి సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 05 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ అకాడమీ హైదరాబాదులో సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌(Telangana Police Sports Meet)లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెడ్‌క్వార్టర్సులో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లు అఖిల, చరిష్మా ప్రతిభ కనబరిచారు. టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో రెండు రజత పతకాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు గుర్తింపు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లు సోమవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

వారు సాధించిన పతకాలను పరిశీలించిన ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఆర్ఐ కాశీరాం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు