తాడువాయి సింగిల్ విండో చైర్మన్ గా సుధాకర్ రావు...
05-10-2026 | 08:58pm
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి సింగిల్ విండో(Tadwai Single Window) చైర్మన్ గా సంతాజి గారి సుధాకర్ రావును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే.మదన్ మోహన్ రావు(MLA K. Madan Mohan Rao) నియమించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బండారు సంజీవులు మాట్లాడుతూ.. పార్టీలో అంకితభావంతో పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని తెలిపారు. ఎమ్మెల్యే పని చేసే వారిని గుర్తించి వారికి న్యాయం చేస్తారన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ... సింగిల్ విండో చైర్మన్ గా నియమించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.