కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి...
సాగునీరు లేక 800 ఎకరాల్లో ఎండిన పంటలు....
బిఆర్ఎస్ నాయకులు మోరల్ శ్రీనివాస్ డిమాండ్
బాన్సువాడ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): నిజామాబాద్(Nizamabad) జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్, శాం రావు తండా, చేలక తండా,చింతల పేట్ తండా శివార్లలో వర్షా బావ ప్రభావం వల్లన, వర్షాలు కురియకపోవడంతో, సుమారు 800 ఎకరాల వరి పంటలు(Paddy Crops) నీరు లేక ఎండిపోయాయి. గట్టు ప్రాంతం అయినా గ్రామాలలో బోరు మోటర్లలో మీరు ఎత్తకపోవడం విద్యుత్ సరఫరా అంతంత మాత్రమే ఉండడంతో పంటలకు సాగునీరు అందక పంటలు ఎండే స్థితికి చేరాయని రైతన్నలు వాపోతున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాసరావు బృందంతో వెళ్లి ఈ రోజు పరిశీలించారు.
పంట నష్టంతో ఆందోళనలో ఉన్న రైతులను పరామర్శించి, వారికి ఓదార్చి, ధైర్యం చెప్పారు. రైతులకు జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి తగిన నష్ట పరిహారం ప్రభుత్వం నుండి అందేలా కృషి చేస్తామని రైతులను భరోసా ఇచ్చారు. అనంతరం పైడిమల్ సబ్ స్టేషన్ వద్ద రైతులకు 24 గంటల త్రీ ఫేస్ కరెంటు ఆటంకం లేకుండ , ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.రైతులను ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఎండిన పంటలకు ప్రభుత్వం స్పందించి,వెంటనే ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయలు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరారు.సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి అయితే ఈ దుస్థితి వచ్చేది కాదని రైతులు వాపోయారు.ఈ కార్యక్రమంలో మోరిల్ శ్రీనివాస్ రావు తో పాటు, మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి,వసంత్ రావు,ఆయా తండాల నాయకులు,రైతులు పాల్గొన్నారు.