కల్హేర్ విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కల్హేర్ మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్(Electrical Substation)ను సోమవారం రైతులు ముట్టడించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ...ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇవ్వకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, రైతుల బోరు మోటర్లు కాలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
ప్రభుత్వం వెంటనే తేరుకొని రైతుల(Farmers)కు నాణ్యమైన 24 గంటల కరెంటును అందించాలని డిమాండ్ చేస్తూ... విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాకు నాణ్యమైన 24 గంటల కరెంటును తక్షణమే అందించి మా పంట పొలాలను కాపాడాలన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని ఉన్నతమైన విద్యుత్ అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, బిఆర్ఎస్ నాయకులు, యువకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.