ఎల్ఓసి అందజేత

04-11-2026 | 02:50pm

జగిత్యాల, నవంబర్ 04 ( విజయ క్రాంతి ): జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన మండల దేవయ్య అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకొనే ఆర్థిక స్తోమత లేక బాధపడుతూ ఉండగా స్థానిక నాయకులు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(Jagtial MLA Dr. Sanjay Kumar) దృష్టికి మండల దేవయ్య అనారోగ్య (మెదడు సంబంధిత ) సమస్యను తీసుకురాగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే మండల దేవయ్య శస్త్ర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల 50వేల ఎల్ఓసి మంజూరు చేయించి జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు మండల దేవయ్య కుటుంబ సభ్యులకు 2లక్షల 50వేల ఎల్ఓసి అందజేసినారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు