విచారణలో వింత పొకడ...?
- ఫిర్యాదుదారునిపై విచారణ హుల్లక్కే
- బాధితుని పై విచారణ చేస్తున్న వైనం
- మానవహక్కుల కమిషన్ విచారణ డొల్ల?
భద్రాద్రి కొత్తగూడెం , నవంబర్ 4 ( విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్కం ఏ ఎ ఈ(District DISCOM AAE) , ఉన్నతాధికారీ డి ఈ వేధింపుల పై న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్(Human Rights Commission) ఆశ్రయిస్తే చేపట్టిన విచారణ లో వింత పోకడ సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు విచారణ అధికారి వేధింపులకు పాల్పడిన అధికారిపై విచారణ చేయకుండా, బాధితుడి పై విచారణ చేయటం గమనారహం.
2018-2022 వరకు కొత్తగూడెం డివిజన్లో పనిచేసిన డి ఈ స్థాయి అధికారి కిందిస్థాయి ఉద్యోగులను మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా డిస్కంలో మూడు విభాగాలు ఉంటాయి. తన పరిధిలో లేని విభాగానికి ఒక ఫైల్ పై ఫర్ అంటూ సంతకం చేయడం ప్రస్తుతం డిస్కంలో జిల్లా స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది .
ఈ ఆరోపణ నేపథ్యంలో పాల్వంచ సబ్ డివిజన్లో ఏఎఈ గా విధులు నిర్వహించిన అధికారి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. డి ఈ స్థాయి అధికారి మానసికంగా వేధించారంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ ఎస్ ఈ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించారు.
సదరు విచారణ అధికారి కొత్తగూడెం డివిజన్లో డి ఈ గా విధులు నిర్వహించిన అధికారి పని తీరుపై కిందిస్థాయి ఉద్యోగులను విచారించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా బాధితుడు ఏ ఏ సబ్ డివిజన్లలో విధులు నిర్వహించారు, అతని పనితీరు, మనస్తత్వంపై సహుద్యోగులు, కిందిస్థాయి సిబ్బందిని, వినియోగదారులను సైతం పిలిపించి ఏకపక్షంగా విచారణ చేస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.
విచారణ అధికారి తీరు డి ఈ ని రక్షించే విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. మానవ హక్కుల కమిషన్ ఎదుటనే నిష్పక్షపాతంగా విచారణ నిర్వహిస్తే తప్ప బాధితులకు న్యాయం జరగదనే వాదనలు కొత్తగూడెం డివిజన్లో వినిపిస్తున్నాయి. ఆ దిశలో మానవ హక్కుల కమిషన్ విచారణ నిర్వహించాలని ఉద్యోగులు, బాధితులు కోరుతున్నారు.