విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి

04-11-2026 | 03:02pm

అనంతపురం: జిల్లాలోని యాడికి మండలం వేములపాడు గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వేములపాడులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లితో పాటు ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. గాయపడిన చిన్నారిని రాయలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే ఆ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో వేములపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు