విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలి

04-11-2026 | 06:34pm

జగిత్యాల జిల్లా విద్యాధికారి  రాము

జగిత్యాల, నవంబర్ 4( విజయ క్రాంతి ): విద్యార్థులు(Students) కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నతంగా రానించాలని జగిత్యాల విద్యాధికారి రాము(Jagtial Education Officer Ramu) అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాము బుధవారం జగిత్యాల రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంఘంపల్లిని ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో పలు విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా డీఈఓ రాము మాట్లాడుతూ  రాబోయే పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చదవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు లో ఉన్నత స్థానంలో ఉండాలంటే ఇప్పటి నుండే మంచి విలువలు కలిగి ఉండాలని, చదువు పట్ల ఆసక్తి కనబరచాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాల సాధనకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరారు.

విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానాలు రాబట్టారు. అనంతరం ఆయన ప్రాథమిక పాఠశాలలు సోమన్ పల్లి, సంఘంపల్లి, హబ్సిపూర్ పాఠశాలలను సందర్శించి ఎఫ్.ఎల్.ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) అమలు తీరును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడాల రవీందర్, ఉపాధ్యాయులు కొక్కుల రాజేష్, బి.గంగాధర్, జె.గంగాధర్, తిరుమల, పోచయ్య, నాగలక్ష్మి, పద్మజ, కాళిదాస్, వెంకటేష్, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు