నెల రోజులు 24 గంటలు పని చేయండి!
- వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తి కావాలి
- పనులు పూర్తయ్యేదాకా కలెక్టర్ రోజూ పర్యవేక్షించాలి: సీఎం
హైదరాబాద్ సెప్టెంబర్ 21 ( విజయ క్రాంతి): వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Warangal Super Speciality Hospital) నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీన్‌చానల్ ద్వారా నిధులు ఇస్తున్నా ఎందుకు పనులు పూర్తి కావడం లేదని మండిపడ్డారు. ఆస్పత్రి నిర్మాణ పనుల పురోభివృద్ధిపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. పనులు ఇంకా పూర్తికాకపో వడంపై అసహనం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజులు 24 గంటల పాటు పని చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు.
సిఎంఓ అధికారులు నిరంతరం పను ల తీరుపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు. ఒక్కో పనికి ఒక్కో అధికారిని నియమంచి, పనుల బాధ్యతను అప్పగించాలని తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు కలెక్టర్ ప్రతి రోజు నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి.. పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. త్వరలో ఓపి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
హాస్పిటల్ చుట్టూ మంచి వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. సనత్‌నగర్ టిమ్స్(Sanathnagar TIMS) తరహాలో ఓపి సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే సనత్‌నగర్ టిమ్స్ లో స్టాఫ్ కోసం క్వార్టర్స్ నిర్మిం చాలని చెప్పారు. పనులు తక్షణమే మొదలు పెట్టాలని తెలిపారు. హాస్పిటల్ మెయింటెన్స్ బాధ్యతలు ఏజెన్సీకి అప్పగించాలని అధికారులకు సీఎం సూచించారు.
హైదరాబాద్ తరహాలో వరంగల్
వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. పెద్దమొత్తంలో నిధులు వెచ్చిస్తున్నందున నిర్మిస్తు న్నందున పనులు సక్రమంగా చేయాలన్నా రు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రధానం గా దృష్టి పెట్టాలని సూచించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లను కలుపుతూ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని తెలిపా రు. వరంగల్ ఎయిర్‌పోర్టు(Warangal Airport) ప్రారంభం నాటి కి రోడ్ కనెక్టివిటీ పూర్తి కావాలన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
అన్ని సౌకర్యాలతో పెద్ద బస్ టెర్మినల్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వరంగల్ కాస్మోపాలిటన్ సిటీగా మారే అవకాశాలు ఉన్నాయనీ, ఆ దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. సమావేశానికి ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జె. చోంగ్దు, మున్సిపల్ శాఖ సెక్రటరీ టి.కె శ్రీదేవి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ హాజరయ్యారు.