బీఆర్‌ఎస్ నేతల నిర్బంధం దుర్మార్గం

22-09-2026 | 05:05am

పాలమూరుకు నీళ్లు ఇవ్వకపోవడం కాంగ్రెస్ వైఫల్యమే: హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy), లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మరికొందరిని నిర్బందించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) మండిప డ్డారు. కృష్ణా జలాల(Krishna waters)ను శ్రీశైలం(Srisailam) నుండి 738 కిలోమీటర్ల దూ రంలో ఎక్కడో పెన్నా బేసిన్‌లో ఉన్న కుప్పం వరకు తరలిస్తుం టే.. పక్కనే ఉన్న పాలమూరుకు ఎందుకు తరలించడం లేదు? అని ప్రశ్నించారు.

ఇది కాంగ్రెస్  వైఫల్యం కాదా? పాలకుల చేతగానితనం కాదా? అని నిలదీశారు. జూరాల ఆయకట్టుకు(Jurala Ayacut) సాగు నీరు అందించాలనే డిమాండ్‌తో నిరసనకు దిగిన రైతులు,  పాలమూరు(Palamuru) బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని సోమవారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు ఖండించారు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు కింద నార్లపూర్(8.51 టీఎంసీ), ఏదుల (6.55), కరివెన(17.34), వట్టెం(16.74 టీఎం సీ) మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలను నిర్మిస్తే.. నీళ్లతో నింపే సోయి కూడా మీకు లేదా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారు? ముఖ్యమంత్రి గానీ, నీళ్ల మంత్రిగానీ దీనికి సమాధానం చెబుతారా? అని నిలదీశారు. 

మరిన్ని వార్తలు