సర్ గడువును మరో 3 వారాలు పొడిగించాలి
కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో సుదర్శన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-సర్) ప్రక్రియకు సం బంధించిన గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission)కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) లేఖ రాశారు. అభ్యంతరాలు(objections), క్లెయిమ్(claim)ల గడువును మరో మూడు వారాల పాటు పొడిగించాలని ఈసీని కోరారు. కాగా రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కోరారు.
అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు మరో ౪ వారాలు సమయం ఇవ్వడంతో పాటు తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ సవరించాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు గతనెలలో సీఎం లేఖ రాశారు. అయితే షెడ్యూల్ ప్రకారం అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువు ఈనెల 16తో ముగియనుంది.
ఈ గడువు పొడిగించాలని వివిధ రాజకీయ పక్షాలు, ఓటర్ల నుంచి విజ్ఞప్తులు రావడంతో 3 వారాలు పొడిగించాలని తాజాగా సీఈవో సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు 47.79లక్షల ఓటర్లకు నోటీసులు జారీచేశారు. నోటీసులో ఇచ్చిన సమయానికి 32.39 లక్షల మంది ఓటర్లు హాజరు కాలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 5,74,504 మంది హియరింగ్ పూర్తి అయిందని అధికారులు వెల్లడించారు.






