5 September, 2026 | 8:44 PM

ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

05-09-2026 | 06:48pm

హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై నీటిపారుదల, ఆహారం & పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) శనివారం సమీక్షించారు. రాబోయే ఖరీఫ్ సీజన్(Kharif season)లో ధాన్యం కొనుగోళ్లను వేగంగా నిర్వహించాలని, గత యాసంగిలో 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రైతులకు 48 గంటల్లోనే రూ.19,500 కోట్లు చెల్లింపులు జరిగాయని, రైతులకు గిట్టుబాటు ధర పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీయే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఖరీఫ్ కు ముందే మిల్లర్లు పాత స్టాక్, బకాయి రికవరీ పరిష్కరించుకోవాలని, రూ.1600 కోట్ల డిఫాల్ట్ బకాయిల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు