6 September, 2026 | 3:21 PM

భూ దోపిడీకే 22 ఏ

06-09-2026 | 05:45am
  1. నిషేధిత జాబితా నుంచి భూములను బేషరతుగా తొలగించాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
  2. రెవెన్యూ శాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఎంపీ డా. కే లక్ష్మణ్ 
  3. నెలకు రూ.400 కోట్లు రేవంత్ పంపిస్తున్నారు: ఎంపీ ఈటల 
  4. 30 శాతం కమీషన్లు అడుగుతున్నారు: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు 
  5. అవినీతి, కుంభకోణాలు చేశారనా.. వెయ్యి రోజుల సంబరాలు?: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 
  6. బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థ(real estate company)లా మారిందని, తెలంగాణ(Telangana)ను ‘ఆర్‌ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ(RR Real Estate Company)’గా మార్చి ఢిల్లీకి కప్పం కడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. భూములను దోపిడీ చేసేందుకే 22 ఏ నిషేధిత జాబితా(Prohibited List) ముందుకు తెచ్చారని, ఆ నిషేధిత జాబితా(Prohibited List)ను బేషరతుగా తొలగించాలని డిమాం డ్ చేశారు.

భూభారతి(Bhubharati)-22 ఏ ద్వారా రైతు లు, పేదలు, మధ్యతరగతి ప్రజల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Eleti Maheshwar Reddy) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, ఎంపీలు డా. కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరు ణ, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడెం నగేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట రమ ణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ‘రేవంత్ రెడ్డి- గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ’గా మార్చేశారన్నారు.

పట్టాలు ఉండి, ఇంటి పర్మిషన్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, మంచినీటి కనెక్షన్లు ఉన్న నివాసాలను, భూములను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి భూదందాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడు తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నా యకులు, ఎమ్మెల్యేలు ప్రజలను వేధించి దో చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌గా మార్చేశారని విమర్శించారు.

గతంలో కేసీఆర్ ప్రభు త్వం ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అ మ్మేస్తే, నేడు రేవంత్ రెడ్డి కూడా అదే రీతిలో భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, కేంద్ర పరిధిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూములను అమ్మి ఇప్పటికే ప్రభుత్వం రూ. 1,200 కోట్లు తీసుకుందని పేర్కొన్నారు.

హౌసింగ్ బోర్డు స్థలాలు, క మ్యూనిటీ అవసరాల కోసం, పార్కుల కో సం కేటాయించిన స్థలాలు, చివరకు దేవాదాయ శాఖ భూములను సైతం వేలం పేరు తో అమ్మేస్తూ, భూములు అమ్మకపోతే పూ టగడవని, ప్రభుత్వం నడవని దుస్థితికి తెచ్చారని విమర్శించారు. పొద్దున లేస్తే సాయం త్రం వరకు కలెక్టర్లతో మాట్లాడుతూ ఏ భూములు అమ్మాలి, వేటిని దోచుకోవాలనే ఆలోచనలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజా పీడనగా కాంగ్రెస్..

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో సుమారు 60 లక్షల ఎకరాలకు పైగా భూములను 22 ఏ కింద చేర్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. ధరణిలోని లోపాలను సరిది ద్దాల్సింది పోయి, వాటిని రెండింతలు మూ డింతలు చేసి మరింత అవినీతికి తెరలేపారని అన్నారు. రాహుల్ గాంధీ దేశమంతా రా జ్యాంగాన్ని చేతబూని తిరుగుతూ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఎద్దేవా చేశారు.

నల్గొండలో బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి, ఆ యన వృద్ధురాలైన తల్లిని గాయపరిచి ఆస్పత్రిపాలు చేస్తే, పరామర్శించడానికి వెళ్తున్న తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుని అక్రమంగా హౌస్ అరెస్ట్‌చేయడం సిగ్గుచేటని, దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని నిలదీశారు.

అధికారులు, నేతలు చేస్తున్న ప్రతి అక్ర మం బీజేపీ నాయకులు, లక్షలాది మంది కార్యకర్తల సెల్ ఫోన్లలో సేవ్ అవుతోందని, 2029లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పైసా లెక్క తేల్చి, జుట్టు పట్టి వసూలు చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తామని స్ప ష్టం చేశారు. భూభారతిలో భూముల తొలగింపు వరకు 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని, ఇది పొరపాటున జరిగింది కాదని, సీఎం, మంత్రులకు తెలిసి పక్కా ప్లాన్ ప్రకారం పేదల భూములను లాక్కునేందుకు చేసిన కుట్రేనని అన్నారు.

భూములపై కన్ను: ఎంపీ లక్ష్మణ్

వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన రెవెన్యూ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములపై కన్నేసిందని, ఇది సంక్షేమ ప్రభుత్వంలా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భూములన్నిం టినీ అమ్మకాలకు పెట్టి భవిష్యత్ తరాల భవితవ్యాన్ని నాశనం చేయడంతో పాటు ఖాళీ భూములు, ఎండోమెంట్, అసైన్మెంట్ భూ ములపై కూడా కన్నేశారని ధ్వజమెత్తారు.

పేదలు, దళితుల అసైన్మెంట్ భూములతో పాటు సామాన్యులు కష్టపడి కొనుక్కున్న వంద, రెండొందల గజాల చిన్న ప్లాట్లను సై తం రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి నెట్ట డం దుర్మార్గమని, దీనివల్ల ప్రజలు పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఉన్నత చదువులకు డబ్బు లు సమకూర్చుకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక తీవ్ర క్షోభకు గురవుతున్నారని అన్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కొర్రెంల గ్రామానికి చెందిన దళితులు తమ పత్రాలతో అధికారుల వద్దకు వెళ్తే, స్థానిక కాంగ్రెస్ నాయకులు, దళారులు రంగప్రవేశం చేసి ఐదెకరాలు ఉంటే రెండెకరాలు ఉంచుకుని మూడెకరాలు వదులుకో వాలంటూ బెదిరింపులకు, సెటిల్మెంట్లకు ది గుతున్నారని ఉదాహరించారు.

మీ భూమిని కాపాడుకోవాలంటే 30 నుండి 40 శాతం వాటా ఇవ్వాలంటూ బేరసారాలు చేస్తూ భ యపెట్టే ప్రయత్నాలను ఇకపై సాగనివ్వబోమని హెచ్చరించారు. హైదరాబాద్‌ను కాంక్రీ ట్ జంగిల్‌గా మారుస్తూ ముషీరాబాద్, ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్ర మల భూములను, వీఎస్టీ, అగర్వాల్ ఇండస్ట్రీస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టే కుట్రలపై రాజ్యసభ లో గళమెత్తానన్నారు. 

గద్దె దింపుతాం: ఎంపీ ఈటల

ప్రజల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదని ఎంపీ ఈటల రాజేందర్ శపథం చేశారు. రేవంత్ రెడ్డికు కేసీఆర్ కంటే దుర్మార్గమైన గతి పడుతుందన్నారు. రాహుల్, సోనియా గాంధీలకు రేవంత్ రెడ్డి నెలకు నాలుగువందల కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు. హిట్లర్ లాంటి క్రూరమైన పాలన రేవంత్ రెడ్డి పాలన అన్నారు. ఆ ప్రభుత్వం వందల కేసులు పెట్టిందని.. తనపై ఇంకా వెయ్యి కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి భరతం పట్టడం ఖాయమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు యస్ బాస్ అని పనిచేస్తే జైళ్లకు పోవడం ఖాయమన్నారు.

మిస్టర్ రంగనాథ్.. మా పేదల ఇల్లు కూలుస్తున్నావు జాగ్రత్త అంటూ ఆయ న హెచ్చరించారు. రాత్రికి రాత్రి భూభారతిలో మార్పులు చేస్తున్నారు. పుప్పాలగూ డలో 134 ఎకరాల, రూ.17 వేల కోట్లు విలు వ చేసే భూమిని మార్చేశారన్నారు. దుర్మార్గపు బిఆర్‌ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. రక్తం చిందించైనా ఈ ప్రభు త్వ దుర్మార్గాలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సీబీఐకి లేఖ రాయాలి: ఏలేటి 

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న భూ దందాలతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన ధరణి, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, ఫార్ములా ఈ-రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ తదితర కుంభకోణాలపై సమగ్ర విచారణ కోసం తక్షణమే సీబీఐకి లేఖ రాయాలని ప్రభుత్వాన్ని బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి డిమాం   డ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన మంత్రులు, అధికారులందరిపై చట్టపరంగా కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.

రెండు రోజుల పర్మిషన్ కోసం బీజేఎల్పీ ఆధ్వర్యం లో అడిగితే, వారం రోజుల పాటు ఇవ్వకుం డా ఇబ్బంది పెట్టారని, చివరికి కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్య, అసెంబ్లీ సెషన్ ఉందని సాకుతో తమకు మాత్రం ఒక్క రోజు మాత్ర మే పర్మిషన్ ఇచ్చారని, కానీ ఆదివారం రో జు ఇక్కడే కాంగ్రెస్ పార్టీ వాళ్లు టెంట్ వేస్తున్నారట అని ఎద్దేవా చేశారు.

అధికార పార్టీ సిగ్గు లేకుండా మంత్రులే ధర్నా చౌక్‌లో ధ ర్నా చేస్తామనడం ఎక్కడా లేదన్నారు. 1000 రోజుల సంబరాలు దేనికి చేసుకుంటున్నారని, అవినీతి, కుంభకోణాలు చేశార నా? ఫీజు రీయింబర్స్మెంట్ హామీలు నెరవేర్చకపోవడానికా? అని నిలదీశారు. రాష్ట్రం అప్పుల మయంగా మారిందని, కనీసం జీ తాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంద ని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయి అవినీతికి, భూమాఫియాకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల ప్రైవేట్, ప్ర భుత్వ భూములను ఉద్దేశపూర్వకంగా 22 జాబితాలో పెట్టి, రెవెన్యూ శాఖను ఒక వ్యా పార సంస్థగా మార్చేశారని మండిపడ్డారు. దీనిపై తక్షణమే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, అధికారుల లాగిన్ల ద్వారా జరిగిన మార్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే, తన కుటుంబ సంస్థల పేరిట ఉన్న రూ. 15 వేల కోట్ల ఆస్తులపై అసెంబ్లీలో సమాధానం చెప్పలేక పారిపోయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చే యాలని ఆయన డిమాండ్ చేశారు. నాడు బ్రిటీష్ రెవెన్యూ సిస్టమ్ పంటలు, భూమిపై పన్నులు వేస్తే,ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ సిస్టమ్ 50- మారిందని మండిపడ్డా రు. ఇది రేవంత్ రెడ్డి ట్యాక్సా లేక రేవంత్ రాహుల్ ట్యాక్సా? అని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

ఆ బంగారు రాఖీతోనే మెడలు కోశారు : ఎంపీ రఘునందన్ రావు

ఒకామె ముఖ్యమంత్రికి బంగారు రాఖి కడితే.. ఆ బంగారు రాఖీతోనే ఆమె మెడలు కోశారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి పేద ప్రజలతో  ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. పేదల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని మనం నిషేధిత జాబితాలో పెట్టాలని కోరారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అన్ని అనుమతులు తీసుకున్న ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టారన్నారు.

తమ అధికారులు తప్పు చేశారని.  మమ్మల్ని క్షమించాలని పొంగులేటి అడుగుతున్నారని, తప్పు చేసిన వారిని శిక్షించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో పెట్టారని, అయితే వాళ్ల తరుపున ఎవరొచ్చి దరఖాస్తు పెట్టారని, మీ ఆస్తులను తీసినట్లు పేద ప్రజలవి ఎందుకు తీసేయలేదో చెప్పాలన్నారు. అప్పుడు ఒక్క కుటుం బం దోచుకుంటే.. ఇప్పుడు అందరు దోచుకుంటున్నారని విమర్శించారు.

తన నియో జకవర్గం ఒక ప్రాంతంలో 55 ఎకరాల భూ మి, వెయ్యి ఇండ్లు నిషేధిత జాబితాలో కలిపారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నీ పాలన ప్రజాపాలనైతే, ప్రజల మీద విశ్వాసం ఉంటే దీనిపై అసెంబ్లీలో ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పరిష్కారమయ్యేలా కలెక్టర్లకు ఆదేశా లు ఇవ్వాలని కోరారు. 

రైజింగ్ తెలంగాణ వద్దు నాయనా: ఎంపీ కొండా

రాష్ట్ర  ప్రజలకు ఏం చేసిందని వెయ్యి రోజుల సంబురాలు నిర్వహిస్తుందని  ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల సంబురాలు ఎందుకు... రైతులు, విద్యార్థులు, టీచర్లను రోడ్ మీద వేసినందు కా అని నిలదీశారు. బంగారు తెలంగాణ అని బీఆర్‌ఎస్ అంటే.. రైజింగ్ తెలంగాణ అని కాంగ్రెసోళ్లు అంటున్నారని, కళ్ళు తెరచి ప్రజల ఇబ్బందులను చూడాలని ఆయన హితవు పలికారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని ప్రజలు అసహించుకుంటున్నారని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

జ్యుడీషియల్ ఎన్‌క్వైరీ వేయాలి: రాంచందర్ రావు 

నిషేధిత జాబితాలో నుంచి భూమి తీసేయాలంటే 30 శాతం కమీషన్ అడుగుతున్నారని, రైతుల భూములను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. 22 ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రైతులను ప్రభు త్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో ఒక బ్లాక్‌లిస్టెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వ్యవస్థను అప్పగించి అవకతవకలకు పాల్పడితే, ఆ లోపాలను సరిదిద్దేందుకు భూభారతి తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఘోరంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 15 శాతం కమీషన్లతో నిషేధిత జాబితాలోని భూముల ను తొల గిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రభుత్వం వేసిన కోదండరాం కమిటీ వంటి వాటితో కొత్త చట్టాలను తీసుకొచ్చి ప్రజలపై రుద్దుతున్నారని, తప్పు జరిగిందని ముఖ్యమంత్రి, మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు అం దుకు బాధ్యులైన ప్రభుత్వా నికి శిక్ష ప డాల్సిందేనని అన్నారు. చివరకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని నిర్మాణాలను కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చ డం శోచనీయమని పేర్కొన్నారు.

ప్రభు త్వ భూములు, వక్ఫ్ బోర్డు భూముల పేరు చెప్పి ప్రైవేట్ పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పేద ప్రజల కడుపు కొట్టేలా సాగుతున్న ఈ అక్రమాలపై సమగ్ర విచారణ కోసం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎన్‌క్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకనే సభను కేవలం రెండు రోజులకే పరిమితం చేస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ధ ర్నాలకు కూడా అనుమతులు ఇవ్వకు ండా ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. సడక్ నుంచి సదన్ వరకు రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.

అవినీతిలో మంత్రుల పోటీ: ఎంపీ డీకే అరుణ 

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రు లు అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ ప డుతున్నారని, అవినీతి పరులను ఏరివేసి, తగిన బుద్ధి చెప్పే రోజులు రాబో తున్నా యని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో బంగారు తెలం గాణ అని  తెలంగాణ ప్రజలను మోసం చేసి.. ఒక కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందన్నారు. పట్టదారుల భూములను దోపిడీ చేసే కుట్ర కాంగ్రెస్ చేసిందని, నాడు ధరణి పేరుతో భూములు కుల్లగొడితే.. నేడు భూ భారతితో కాంగ్రెస్ కొత్త పన్నాగంతో భూ ములు దోచుకుంటుందని ఆరోపించారు.

పిల్లల పెండ్లిల్ల కు, కష్టం వచ్చిందనో అవసరానికో భూమి అమ్ముకోవాలంటే.. నేడు అ మ్ముకునే పరిస్థితి లేద న్నారు. 22 ఏలో ఉన్న పట్టా భూములు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశా రు. బీజేపీ భ యంతో అసెంబ్లీ సమావేశాలు కేవలం రెండురోజులు మాత్రమే నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ధ ర్నా చౌక్ ఎత్తివేస్తే.. ఈ ప్రభుత్వం ధర్నాలకు అనుమతి ఇవ్వడంలేదన్నారు.

రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల గొ ంతు నొక్కే ప్రయ త్నం ప్రభుత్వం చేస్తు ందని, కాంగ్రెస్ హామీలు కాగితాలకే పరిమితం చేసిందన్నారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదు రు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అవినీతి, దోపిడీలో.. బీఆర్‌ఎస్‌ను మిం చి పోయిందని విమర్శించారు. అసెంబ్లీ స మావేశాలలో 22 ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములు తొలగిస్తున్నామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు