గ్రామాలలో పారదర్శకంగా భూముల రీసర్వే

22-09-2026 | 07:41pm

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి

హనుమకొండ, జిల్లా సెప్టెంబర్ 22(విజయ క్రాంతి): గ్రామాలలో చేపట్టిన భూముల రీ సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి (Additional Collector N. Ravi) అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో భూముల రీసర్వే పై అవగాహనకు భూములు కొలతల శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు.ఈ సందర్భంగా భూములు కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లు భూముల రీసర్వే కి సంబంధించిన అంశాలపై  గ్రామసభలో రైతులు, స్థానికులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ  ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే అవకాశాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలకు తావులేకుండా  భూముల రీ సర్వే జరుగుతుందన్నారు. భూముల రీ సర్వే చేపడుతుండగా గ్రామ రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సర్వేయర్లకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, భూములు కొలతలు శాఖ ఏడీ నూర్ సింగ్, తహసిల్దార్ కిరణ్ కుమార్, డీఐ సారంగపాణి, ఇతర అధికారులు, వార్డు సభ్యులు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు