వినాయకుడికి 31 రకాల నైవేద్యాలు
22-09-2026 | 10:52pm
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల(Sri Saraswati Shishu Mandir English Medium School)లోని శ్రీ శారదా వినాయక మండలి వద్ద గణనాథుడికి 31 రకాల నైవేద్యాలను సమర్పించారు. ఆచార్య బృందం, మాతృభారతి సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు తెలిపారు.