ఆడపిల్లకే కాదు.. మగబిడ్డకూ రక్షణ కావాలి!
పల్నాడు: చిన్నారులపై లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పల్నాడు(Palnadu) జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకులు బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇప్పటివరకు బాలికలపై లైంగిక దాడుల ఘటనలపై ఎక్కువగా చర్చ జరుగుతుండగా.. బాలురూ లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.చిన్నారుల భద్రత విషయంలో లింగభేదం లేకుండా అప్రమత్తత అవసరమనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే సమర్థవంతంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.