అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
22-09-2026 | 06:47pm
హైదరాబాద్: నగరంలో వర్షాల దృష్ట్యా మున్సిపల్ కమిషనర్లు, హైడ్రా(Hydra), పోలీసు కమిషనర్లను, తదితర అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అప్రమత్తం చేశారు. సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు(Rainwater) నిలవకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు.