శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు
22-09-2026 | 10:44pm
ఎర్రుపాలెం సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మండల పరిధిలోని జమలాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(Sri Venkateswara Swamy Temple) హుండీ ఆదాయం మంగళవారం నాడు లెక్కించారు. జమలాపురం దేవస్థానం ఈవో కొత్తూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులు సమర్పించిన 98 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం ఆదాయం 54,78,000 వేల 853 వచ్చినట్లు దేవస్థానం ఈవో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ పరిశీలకులు ఆర్ సమత ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ విజయ్ దేవరశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ డి సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ ఈ కృష్ణ ప్రసాద్, శ్రీ సాయి సత్య సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.