రేపే షియోమీ 18 ప్రో సిరీస్ లాంచ్
చైనా: షియోమీ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు Xiaomi 18 Pro, 18 Pro Maxలను సెప్టెంబర్ 23న చైనాలో విడుదల చేయనుంది. రాత్రి 7 గంటలకు లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈసారి స్టాండర్డ్ Xiaomi 18 మోడల్‌ను విడుదల చేయడం లేదు.కొత్త సిరీస్‌లో భారీ బ్యాటరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 18 Proలో 7,000mAh, 18 Pro Maxలో 8,500mAh బ్యాటరీలు ఉండనున్నాయి. 32 శాతం సిలికాన్ ఆధారిత పదార్థంతో బ్యాటరీలను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. కెమెరా విభాగంలో రెండు ఫోన్లలోనూ 200MP ప్రధాన కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి.
లైకా భాగస్వామ్యం కొనసాగనుంది. అలాగే 2nm ప్రాసెస్‌పై తయారైన కొత్త తరం చిప్‌ను ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. Xiaomi 17 సిరీస్‌లో పరిచయం చేసిన వెనుక సెకండరీ డిస్‌ప్లేను కొత్త మోడళ్లలోనూ కొనసాగిస్తున్నారు. HyperOS 4లో AI ఆధారిత ప్రత్యేక కార్డులను ఈ స్క్రీన్‌పై ఉపయోగించుకునే అవకాశం ఉండనుంది. కొత్త ఫోన్ల ధరలను షియోమీ ఇంకా వెల్లడించలేదు. గత ఏడాది 17 Pro, 17 Pro Max ప్రారంభ ధరలు వరుసగా CNY 4,999, CNY 5,999గా ఉన్నాయి. కొత్త సిరీస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.