అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

22-09-2026 | 11:05pm

- కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి/తాండూర్, సెప్టెంబర్ 22 : జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండల కేంద్రంలో భారత జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన గోశాలకు డి.సి.పి. ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జాతీయ రహదారుల సంస్థ పి.డి. అజయ్ మణికుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, తహసిల్దార్ కృష్ణలతో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో 1.15 ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అంతకు ముందు తాండూర్ మండల కేంద్రంలోని జీజీబీవీనీ సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలోని ద్వారకాపూర్ లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను మండల తహసిల్దార్ జ్యోత్స్న తో కలిసి పరిశీలించారు.

గ్రామ నక్షలు, రైతుల సంబంధిత భూముల నిర్ధారణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి, ఆసరా పింఛన్ల దరఖాస్తుల పరిశీలన వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించి ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గర్భిణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ కార్యాలయాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ తో కలిసి సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పరిశీలించారు.

మరిన్ని వార్తలు