స్వామివారికి ఏకాదశి లక్ష పుష్పార్చన..

22-09-2026 | 10:49pm

స్వామివారి హుండీ ఆదాయం  2 కోట్ల 59 లక్షలు...

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Sri Lakshmi Narasimha Swamy Devasthanam)లో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రానుసారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆస్థాన ముఖమండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించారు.

ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేసి ప్రధానార్చక బృందం మంత్రోచ్ఛారణల మధ్య పుష్పార్చన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అర్చక బృందం, దేవస్థాన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు... స్వామివారి హుండీ ఆదాయం 2,59,03,628/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉండి లెక్కింపును కొండ కింద సత్యనారాయణ వ్రతం 2 లో లెక్కింపు చేశారు. హుండీ ఆదాయము 2,59,03,628/- వచ్చినట్లు  ఆలయ అధికారులు భవాని శంకర్ తెలిపారు.

మరిన్ని వార్తలు