పెన్షన్‌ ఫైల్‌కు లంచం డిమాండ్‌.. ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు

22-09-2026 | 10:09am

హైదరాబాద్: నిమ్స్‌ ఆస్పత్రి అదనపు సూపరింటెండెంట్‌ లక్ష్మీ భాస్కర్‌(Lakshmi Bhaskar)కు సంబంధించిన నివాసాలు, బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

ALSO READ: సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి

మూడు జిల్లాల పరిధిలో మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు కొనసాగిస్తున్నారు. లక్ష్మీ భాస్కర్‌ నివాసంతో పాటు ఆమెకు సంబంధించినట్లు భావిస్తున్న బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.సోదాల్లో భాగంగా ఇళ్లలోని పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయ వనరులు, ఆస్తుల వివరాలు, వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.

12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు

ఒకేసారి మూడు జిల్లాల్లో 12 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతుండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఆయా ప్రాంతాల్లో లభించిన పత్రాలు, ఆస్తుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత గుర్తించిన ఆస్తులు, స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోదాలు పూర్తయిన అనంతరం అధికారులు వెల్లడించే వివరాలపై ఆసక్తి నెలకొంది.

ALSO READ: ఏసీబీ వలలో ఇద్దరు అధికారులు


మరిన్ని వార్తలు