జాతీయ వాదుల సంగమం 2026ను విజయవంతం చేయాలి
హనుమకొండ,(విజయక్రాంతి): జాతీయ వాదుల సంగమం -2026(Nationalists Confluence 2026) పేరుతో నవంబర్ -3న హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కన్వీనర్ పాపారావు(Convener Paparao) పిలుపునిచ్చారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, నాయకు లచే సన్నాహక సమావేశము హనుమకొండ బాలసముద్రం లోని సామ జగన్మోహన్ భవన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కన్వీనర్ పాపారావు మాట్లాడుతూ... అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థులు, కార్యకర్తల సమూహం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఇందులో డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు కి అభినందనలో కూడిన సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమానికి పూర్వ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ జాతీయ వాదులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ కార్యకర్తలు సంగెం శ్రీనివాస్,ఆకుల నాగేశ్వర్,కిషన్,శ్రీమాన్,గండ్రకోట కుమార్,లవన్,కుమార్,ఉమాశంకర్,రాజు,శశి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.