యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లను భర్తీ చేయాలి
ఏబీవీపీరాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లను(Assistant Professor Posts) మొత్తం భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం వసతి గృహంలో యూనివర్సిటీ ఎబివిపి కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడమే కాకుండా, ల్యాబ్ లలో ఇక్యూమెంట్, ఇనఫ్రాస్టక్చర్ లేకపోవడంతో పరిశోధన కుంటుపడి విశ్వ విద్యాలయంలో విద్యా వాతవరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంభించిన కారణంగానే గత ఎన్నికల్లో ప్రజల చేతిలో చావు దెబ్బ తిన్నారని, ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యశాఖ కు బాధ్యత వహిస్తూ విద్యకు కేటాయించిన బడ్జెట్ ను చూసిన నవ్వొస్తుందని ఎద్దెవా చేశారు.
యూనివర్సిటిలలో రిక్రూట్మెంట్ ను స్వాగతిస్తున్నామని కానీ తెలంగాణలోనే రెండవ అతిపెద్ద కాకతీయ యూనివర్సిటీ లో కేవలం 49 పోస్టులు నింపడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పునారాలోచించి చారిత్రక నేపథ్యం ఉన్నా కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను మొత్తం నింపాలని ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను వెంటనే రెగ్యులర్ కోర్సలుగా పరిగణించిన తర్వాతనే నోటిఫికేషన్ లు విడుదల చేయాలని ఆయన విశ్వ విద్యాలయ వీసీ లను డిమాండ్ చేశారు.
2013 నోటిఫికేషన్ రద్దు అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన అసిస్టెంట్ ప్రోఫెసర్ లను కొనసాగించడం యూనివర్సిటీ అధికారుల అసమర్దతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన వారిని వెకెట్ చేయించాలని కేయూ అధికారులను డిమాండ్ చేశారు.కాకతీయ యూనివర్సిటీలో అర్హత లేకుండా, ఫేక్ నెట్,సెట్ సర్టిఫికెట్స్ తో పార్ట్ టైం మరియు కాంట్రాక్టువల్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని వెంటనే విధుల నుండి తొలగించాలన్నారు.
సూపర్ ఎలినో కారణంగా ప్రత్యేక నిధులుయాలని అడుగుతున్నా సమయంలో ఈ కాకతీయ యూనివర్సిటీలోని మెస్ టెండర్లు రేట్లను పెంచి విద్యార్థులపై ఫీజుల భారం వేస్తే ఏబీవీపీ ఊరుకోదని హెచ్చరించారు. అలాగే ఏదైతే టెండర్లు పెంచిన రేట్లు యూనివర్సిటీలోని విద్యార్థుల నుంచి కాకుండా యూనివర్సిటీ బ్లాక్ గ్రాండ్ నుంచి తట్టుకోవాల్సిందిగా వారు హెచ్చరించారు. అలాగే ఈ యూనివర్సిటీలోని సెక్యూరిటీ టెండర్స్ అయిపోయి 4 నెలలైతున్న ఇప్పటికీ కొత్త టెండర్లు ఆహ్వానించకుండా పాత టెండర్ల తోనే నడిపించడంలో గల కారణాలేంటి, ఇందులో ఎవరికి ఏం లాభం ఉంది అని ఆయన అన్నారు.
వెంటనే సెక్యూరిటీ టెండర్లను తీసుకొని కొత్త టెండర్స్ పిలిచి యూనివర్సిటీ లలో ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా రిక్రూట్మెంట్ జరుపాలని,అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేని పక్షం లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ నిమ్మల రాజేష్, అంబాల కిరణ్, సాయి కుమార్,వినోద్,ప్రణయ్,కార్తీక్, ప్రశాంత్,రిషి తదితరులు పాల్గొన్నారు.