ఆటల్లో మనమెక్కడ?

22-09-2026 | 05:00am

ఒలింపిక్స్‌(Olympics)లో చైనా, జపాన్(China, Japan).. ఆసియా క్రీడ(Asian Games)ల్లో చైనా, జపాన్..! నాలుగేండ్లకోసారి జరిగే ఈ ఆటల సమరంలో ప్రతిసారీ ఆ దేశాల పేర్లే మార్మోగుతుంటాయి. పతకాల వేటలోనూ అక్కడి క్రీడాకారుల(Sportsmen)దే పైచేయి కనిపిస్తున్నది. అథ్లెటిక్స్(Athletics), ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్(Archery, gymnastics, boxing).. ఇలా ఏ ఆటను తీసుకున్నా 140 కోట్ల జనాభా ఉన్న భారత్ వెనుకంజలోనే ఉంటున్నది. అట్లా అని మన దగ్గర క్రీడాకారులు లేరా అంటే.. ఉన్నారు. కోకొల్లలు. కానీ, ప్రోత్సాహమే కరువవుతున్నది. ఇక్కడ క్రికెట్‌కు దక్కుతున్నంత దన్ను ఇతర క్రీడలకు దక్కడం లేదన్నది వాస్తవం.

క్రికెట్ మినహా ఇతర ఆటల్లో సరైన శిక్షణ ఇచ్చేవారు లేకపోవడం, అలాంటి అవకాశాలను ప్రభుత్వాలు కల్పించకపోవడంతో విశ్వక్రీడా వేదికైన ఒలింపిక్స్‌లో, వాటికి రిహార్సల్స్‌గా జరిగే ఆసియా క్రీడల్లో మన క్రీడాకారులు అంతగా రాణించలేకపోతున్నారు. 45 దేశాలు పాల్గొంటున్న ఆసియా క్రీడలు ప్రస్తుతం జపాన్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఎప్పటిలానే చైనా, జపాన్ వంటి దేశాలు సత్తా చాటుతున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 43 రకాల ఆటలు జరుగుతుండగా.. ఇందులో భారత్ నుంచి దాదాపు 30 ఆటల్లోనే క్రీడాకారులు పాల్గొంటున్నారు.

2023లో జరిగిన ఆసియా క్రీడల్లో మనం 4వ స్థానం లో నిలిచినప్పటికీ.. 2024లో జరిగిన ఒలింపిక్స్‌లో మాత్రం 71వ స్థానానికి పడిపోయాం. కేవలం ఆరు పతకాలతోనే ఒలింపిక్స్‌లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మనకన్నా చిన్న దేశాలైన దక్షిణ కొరియా, హంగేరి వంటి ఎన్నో దేశాలు కూడా పతకాల వేటలో ముందు వరుసలో ఉంటున్నా యి. ఒలింపిక్స్‌లో చాలా రకాల ఆటల్లో మన క్రీడాకారులకు ప్రాతినిధ్యం కూడా దక్కడం లేదు.  ఫార్మాట్ ఏదైనా క్రికెట్‌లో మాత్రం విశ్వవిజేతగా నిలుస్తున్న భారత్.. ఇతర క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిరకాల క్రీడలకు తగినప్రోత్సాహకాలు అందిస్తే కానీ అది సాధ్యం కాదు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఒలింపిక్స్ లక్ష్యంగా చిన్నప్పటి నుంచే పిల్లలను తీర్చిదిద్దుతుంటాయి. ఇటు చదువుతోపాటు అటు ఆటల్లోనూ ప్రత్యే క శిక్షణనిస్తుంటాయి. ఒకే రకమైన క్రీడాంశంపైనే కాకుండా అన్నిరకాల గేమ్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంటాయి. అందుకుతగ్గ వాతావరణాన్ని కల్పిస్తుంటాయి. మన దగ్గర కూడా అలాంటి వాతావరణం ఏర్పడితే కానీ విశ్వక్రీ డా సంభ్రమంలో ముందువరుసలో నిలబడలేమన్న విషయాన్ని పాలకులు గుర్తించి, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

మరిన్ని వార్తలు