ఆదివాసీ అగ్గి బరాటా కొమురం భీం
అతను ఒక అగ్గి బరాటా.. పోరాట యోధుడు.. మీసం మెలితిప్పే వీరుడు.. గెరిళ్ల పోరాటంలో మడమ తిప్ప ని నాయకుడు.. ఆయన పేరు చెబితే నిజాం సర్కారుకు(Nizam Government) దడ పుట్టేదట. ఆయనే కొమురం భీం. గిరిజన గోండు తెగకు చెం దిన కొమురం చిన్నూ-, సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో అక్టోబర్ 22, 1901న జన్మించారు.
హైదరాబా ద్ విముక్తి కోసం ఆసఫ్ జాహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన గిరిజనోద్యమ నాయకుడు. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమురం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా శైలిలో పోరాడారు. అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను తోసిపుచ్చాడు.
పశువుల కాపరులపై విధించిన సుంకానికి వ్య తిరేకంగా ఉద్యమించి వీరమరణం పొం దారు. భారత్‌లో ఆదివాసీల హక్కుల కో సం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైన వి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరో చితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొము రం భీం ‘జల్- జంగిల్- జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచారు.
కొండలు, కోనలు, ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీలకు అడవిపై హక్కు సామాజిక న్యాయం లో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన భీం.. నిజాం సర్కార్ గుండెల్లో సింహస్వప్నంగా మారిన పోరాటయోధుడు. కరిమెర ప్రాం తంలోని సర్దాపూర్‌లో భీం కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అనే జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవే శం పట్టలేని భీం అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయారు. అక్కడ ఐదేళ్లు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీం తిరిగి కరిమెర చేరుకున్నారు.
నిజాం నవాబు పశువుల కాపరులపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించారు. ఆసిఫా బాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గు ట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించారు. భీంకు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్య మంలో పాల్గొన్నారు. వెడ్మ రాము కూడా భీంకు సహచరుడిగా ఉన్నారు.
కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీం స్థావరాన్ని ముట్టడించి భీంను హతమార్చాయి. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బం ది పైనా కొమరం కొదమసింహంలా గర్జించారు.
కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొము రం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940, అక్టోబర్ 27న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున భీం వీరమరణం పొందారు. అప్పటి నుం చి ఆ తిథి రోజునే భీం వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.
ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక భీం. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క. పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పో రాట యోధుడు. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి 72 ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజా లు జరుపుకుంటున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఇప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివి నుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసా ల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పం ట వేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు గోండులను తరిమేశారు. పంటలను ధ్వం సం చేశారు. జరిమానాలతో వేధించారు.
ఈ వేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే ఆదిలాబాద్ గోండన్నలు పోరు బాట పట్టారు. తమ విముక్తి కోసం పోరాట జెండా పట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’ అంటూ పన్నెండు గూడాలు కొ మురం భీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. భీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించేలోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది.
భీంతో సహా పన్నెండు మంది అమరులయ్యారు. ని జాం సర్కారు పాశవికంగా భీం పోరాటా న్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్ లోద్దుల్లో నేటికీ ప్రతి ధ్వనిస్తున్నది. ఏ హక్కుల కోసమైతే నాడు భీం ఉద్యమించారో ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ పోరాటం చేయవలసే వస్తున్నది. ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా..ఆదివాసుల అవస్థలు ఏమీ తీరలేదు. భీం మరణించి 80 ఏళ్లు గడుస్తున్నా జల్, జంగిల్, జమీన్‌పై ఆదివాసీ లు నేటికీ హక్కులు పొందలేకపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు.
భీం పుట్టింది ఆదిలాబాద్ జిల్లా కరమెరి మండలం సంకెపల్లి.. పెరిగింది సుర్తాపూర్. కష్టపడి అడవి నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లు. రాత్రింబవళ్లు కావలి కాసి పంటలు పండించే వాళ్లు. గిరిజనులపై నిజాం సర్కారు పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు పంట ను కొట్టిన కల్లంలోనే.. కైలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పేవారు.
గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు ఎంతటి దట్టమైన అడవిలో భూములను సాగుచేకున్నప్పటికీ వాటిపై తమకే పట్టా లు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగలాత్ వాళ్లు గొడవలు చేసేవాళ్లు. తిరిగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్లు. ఇలాంటి సంఘటనలే భీంను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలకొట్టాడు భీం. ఈ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చనిపోయాడు.
దీంతో భయపడ్డ భీం మహారాష్ట్రలోని బల్లార్షా కి పో యాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీపని చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నారు. మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నారు. కొత్తకొత్త పంటలు పండించటం, వాటిని మార్కెట్లో మంచి ధరకు అమ్మటం తెలుసుకున్నారు తరువాత భీం తల్లిదండ్రులు ఉంటున్న కాకన్‌ఘాట్‌కు వచ్చారు.
ఆ గ్రామంలోని గిరిజనుడు లచ్చుప వద్ద జీతం ఉండగా భీంకు సోం బాయితో పెళ్ళి జరిగింది. ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబా ద్ తహసీల్దార్‌కు కట్టేవారు. భీం అప్పటి తహసీల్దార్‌తో మాట్లాడి లచ్చుప పన్నెం డు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజను లందరికీ భీం నాయకుడయ్యారు.
1940 అక్టోబర్ 27న మరణించారు. ఆయన గొప్పతనం ప్రతి ఒక్కరిలో స్పూర్తి నిం పాలి. ఆయన వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఆయన్ను నిత్యం స్మరించికునేలా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పేరు పెట్టడం అభినందనీ యం. ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలి. మంచి విద్య, వైద్యం అందుబాటులో ఉంచాలి. ప్రతి జిల్లాలో భీం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి.
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 9848445134