కూలీల మధ్య గొడవలో ఓ వ్యక్తి హత్య

27-09-2026 | 10:59am

నల్గొండ,క్రైం సెప్టెంబర్ 27: నల్గొండ పట్టణంలోని మీర్బాగ్ కాలనీ(Mirbagh Colony) రోడ్ నంబర్ 6లో శనివారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ నాలుగో ఫ్లోర్ లోని 402 రూమ్ లో ఈ ఘటన జరిగింది. తమిళనాడు (Chennai) కు చెందిన కూలీల మధ్య డబ్బుల విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు.

నల్గొండపట్టణ o లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చెన్నై షాపింగ్ మాల్ నిర్మాణ పనుల కోసం చెన్నై నుండి కూలీలుగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న వెంటనే టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు లు,పోలీసులు క్లూస్ టీమ్ తో ఘటనా స్థలానికి చేరుకుని. కేసు నమోదు చేసిన పోలీసులు.హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు