టాటా టీ కొత్త క్యాంపెయిన్!

28-11-2026 | 05:05am

హైదరాబాద్: టీ విషయంలో తమ అభిరుచులకు ఎలాంటి రాజీ పడని టీ ప్రియులను ఆకట్టుకునే లక్ష్యంతో టాటా టీ చక్ర గోల్డ్ జెమిని సరికొత్త ‘నెవర్ కాంప్రమైజ్(Never Compromise Campaign)’ ప్రచారాన్ని ప్రారంభించింది. తెలుగు కుటుంబాల టీ అభిరుచులు, గాఢమైన రుచి, ప్రత్యేకమైన సువాసనను ప్రధానంగా తీసుకుని ఈ క్యాంపెయిన్‌ను రూపొందించింది. ముఖ్యంగా ‘గజబలం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఏనుగుల శక్తివంతమైన రూపాలను ప్రకటనలో చూపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది.

బ్రహ్మపుత్ర లోయ నుంచి సేకరించిన ఎంపిక చేసిన అస్సాం టీ ఆకులతో తయారయ్యే జెమిని డస్ట్ టీ మిశ్రమం, పాలలో కలిసిన తర్వాత కూడా గాఢమైన రుచి, మంచి సువాసనను అందిస్తుందని సంస్థ పేర్కొంది. తెలుగు సినిమా శైలిలో ఉత్కంఠ, హాస్యాన్ని కలగలిపి రూపొందించిన ఈ ప్రకటనలో మహిళా అధికారి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తన ముందు ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని ఆమె, టీ విషయంలోనూ రాజీపడకుండా బలహీనమైన రుచితో ఉన్న టీని పక్కనపెట్టి టాటా టీ చక్ర గోల్డ్ జెమినినే ఎంచుకుంటుంది.

ఈ క్రమంలో ఏనుగులతో రూపొందించిన సన్నివేశాలు ‘గజబలం’ భావనను మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి. మరోవైపు, ఈ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన డిజిటల్ చిత్రం టీ నాణ్యత, స్వచ్ఛత, కల్తీ నిరోధకతపై వినియోగదారుల్లో అవగాహన పెంచడంపై దృష్టి సారించింది. ఇంటికి తీసుకువచ్చే టీ నాణ్యత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనే సందేశాన్ని అందిస్తోంది. మొత్తంగా రుచి, సువాసన, నాణ్యత, స్వచ్ఛత అనే అంశాలను వినూత్న ప్రకటనల రూపంలో ప్రజలకు చేరువ చేయడమే ఈ ‘నెవర్ కాంప్రమైజ్’ ప్రచారం ప్రధాన ఉద్దేశం.

మరిన్ని వార్తలు