మెనాలోకి ఎంట్రీ ఇచ్చిన జియో హాట్‌స్టార్

08-10-2026 | 09:21pm

ముంబై 2026: భారతదేశపు అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జియోహాట్‌స్టార్(JioHotstar), వేగంగా అభివృద్ధి చెందుతున్న తమ అంతర్జాతీయ విస్తరణ ప్రక్రియలో భాగంగా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలోకి ప్రవేశిస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది.

యుకె, కెనడా, సింగపూర్‌లలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత లభించిన అద్భుతమైన స్పందనకు కొనసాగింపుగా, మెనా (MENA) లో ప్రవేశించటం ద్వారా దక్షిణాసియా ప్రేక్షకులకు అత్యంత ముఖ్యమైన ప్రపంచ ప్రాంతాలలో ఒకటైన ఈ మార్కెట్ లో జియోహాట్‌స్టార్ తమ కార్యకలాపాలను విస్తరించింది, తద్వారా విస్తారమైన, బహుభాషా వినోద మార్కెట్‌తో జియోహాట్‌స్టార్‌కు అనుసంధానం ఏర్పడింది. స్టార్జ్‌ప్లే ( STARZPLAY)తో భాగస్వామ్యం ద్వారా, స్టార్జ్‌ప్లే యాప్ , వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక స్ట్రీమింగ్ గమ్యస్థానంగా జియోహాట్‌స్టార్ అందుబాటులో ఉంటుంది.

ఈ భాగస్వామ్యం జియోహాట్‌స్టార్ యొక్క విస్తృత, వైవిధ్య భరితమైన కంటెంట్ ను , స్టార్జ్‌ప్లే యొక్క ప్రాంతీయ పరిధి, ప్రేక్షకులపై అవగాహన , స్ట్రీమింగ్ నైపుణ్యంతో మిళితం చేస్తుంది. మెనా ప్రాంతంలోని ప్రేక్షకులు ఇప్పుడు భారతదేశంలో విడుదలైన వెంటనే కొత్త జియోహాట్‌స్టార్ ఒరిజినల్స్‌ను, జియోస్టార్ టీవీ ఛానెళ్ల నుండి  ప్రముఖ టెలివిజన్ కంటెంట్‌ను, బ్లాక్‌బస్టర్ చిత్రాలను, కొన్ని అతిపెద్ద రియాలిటీ ఫ్రాంచైజీలను 10 భాషల వరకు ఆడియో ట్రాక్‌లను అందించే కంటెంట్‌తో చూడగలుగుతారు.

వీటిలో రాబోయే 'కాఫీ విత్ కరణ్' సీజన్ , ప్రస్తుతం కొనసాగుతున్న, ఆరు భాషలలో అందుబాటులో ఉన్న 'బిగ్ బాస్' సీజన్ వంటివి ఉన్నాయి. హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, బంగ్లా , ఇతర భాషలతో పాటు, ఈ ఆఫర్‌లో ఆ ప్రాంతంలోని మలయాళీ ప్రేక్షకుల ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా గణనీయమైన మలయాళ కేటలాగ్ కూడా ఉంది.

జియోహాట్‌స్టార్ అనుభవం స్టార్జ్‌ప్లే యొక్క ప్లస్ ప్లాన్ ద్వారా నెలకు AED 34.99కు అందుబాటులో ఉంటుంది, ఇది ప్రేక్షకులకు దాని బహుభాషా లైబ్రరీని చేరుకునే అవకాశం అందిస్తుంది. నెలకు AED 49.99 ధర కలిగిన మాక్స్ ప్లాన్, జియోహాట్‌స్టార్ యొక్క పూర్తి వినోద సేవలను స్టార్జ్‌ప్లే యొక్క స్పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోతో మిళితం చేస్తుంది. ఇది మొత్తం కుటుంబం కోసం వినోదాన్ని, ప్రధాన క్రీడా ఈవెంట్‌లను ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో అందిస్తుంది.

మధ్యప్రాచ్యంలోకి జియోహాట్‌స్టార్ విస్తరణపై జియోస్టార్ ఇంటెర్నేషనల్ బిజినెస్ హెడ్ అమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, “యూకే, కెనడా, సింగపూర్‌లలో జియోహాట్‌స్టార్‌కు లభించిన బలమైన ప్రారంభ స్పందన, భారతీయ వినోద రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలపై మా నమ్మకాన్ని మరింత బలపరిచింది. మేము జియోహాట్‌స్టార్‌ను ఒక నిజమైన గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దుతున్న క్రమంలో, ప్రపంచంలోనే అతిపెద్ద దక్షిణాసియా ప్రవాస సమాజాలలో ఒకటిగా ఉన్న మరియు వివిధ భాషలలో వినోదం పట్ల అపారమైన ఆసక్తిని కలిగి ఉన్న మెనా ఒక కీలకమైన తదుపరి మార్కెట్ గా నిలుస్తోందన్నారు. 

ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, స్టార్జ్‌ప్లే సీఈఓ మాజ్ షేక్ మాట్లాడుతూ , “మెనా ప్రాంతంలో స్ట్రీమింగ్ వృద్ధి యొక్క తదుపరి దశ, సరైన బ్రాండ్‌లను ఒకచోట చేర్చి, వీక్షణ అనుభవాన్ని మరింత విలువైనదిగా మార్చే ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రూపుదిద్దుకుంటుంది. వినోద మార్కెట్‌ రోజురోజుకూ విభజితమవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెంట్‌ కోసం వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వెతకాల్సిన అవసరం ఉండకూడదు. జియోహాట్‌స్టార్‌ను స్టార్జ్‌ప్లేకి తీసుకురావడం అనేది ఆ భవిష్యత్తులో ఒక వ్యూహాత్మక పెట్టుబడి. ఇది భారతీయ కథనాల శక్తిని, ఈ ప్రాంతంపై , మేము సేవ చేస్తున్న ప్రేక్షకులపై మాకున్న అవగాహనతో మిళితం చేస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు