నెల్లిపాకలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
26-10-2026 | 06:57pm
అశ్వాపురం, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మండలంలోని నెల్లిపాక శ్రీరామ కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే పత్తి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.