పోలీసుల ఆధ్వర్యం లో మెగా రక్తదాన శిబిరం
దమ్మపేట, అక్టోబర్ 30(విజయ క్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ(Commemoration of Police Martyrs) వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాల్వంచ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సూచనల మేరకు అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్(Ashwaraopeta Circle Inspector) ఆధ్వర్యంలో దమ్మపేట పోలీస్ స్టేషన్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు సంబంధించినటువంటి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని 62 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.
ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికేట్ లను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దమ్మపేట జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ భవాని, అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ ఎం ఓ హాజరైనారు. ఈ కార్యక్రమంలో వివిధ పంచాయతీల సర్పంచులు, దమ్మపేట, అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.