డీవైఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
జిల్లా అధ్యక్షుడిగా ధరావత్ శివ, ప్రధాన కార్యదర్శిగా లకావత్ కుమార్ ఎన్నిక
కొత్తగూడెం, టౌన్ అక్టోబర్ 16: (విజయక్రాంతి) : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(Democratic Youth Federation of India) (డీవైఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) మూడవ మహాసభ శుక్రవారం కొత్తగూడెంలోని టీచర్స్ భవన్లో(Teachers Bhavan) నిర్వహించారు. ఈ మహాసభలో జిల్లా నూతన కమిటీని మహాసభ ప్రతినిధులు ఎన్నుకోగా, కిషోర్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులను, కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు, ఈ నూతన కమిటీని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళంగి హరికృష్ణ ప్రకటించారు.
నూతన జిల్లా అధ్యక్షుడిగా ధరావత్ శివ(Dharavath Shiva), ప్రధాన కార్యదర్శిగా లకావత్ కుమార్(Lakawat Kumar), కోశాధికారిగా చింతలపూడి శ్రావణి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సండ్ర భూపేంద్ర ,గణేష్, బాలాజీ, వీరబాబు, సహాయ కార్యదర్శులుగా స్వరూప, చిట్టి, సుధీర్, శ్రీకాంత్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా రాంబాబు, చిమట నరేష్, హర్ష, పవన్, బడుగుల శివ, కిషోర్, సుజిత్, సాంబశివరావు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా డీవైఎఫ్ఐని బలోపేతం చేసి, యువతను పెద్ద సంఖ్యలో సంఘంలోకి తీసుకువస్తామని తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కారం, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాల కల్పన, యువతకు నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్మిస్తామని, యువజన హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం యువతను చైతన్యపరుస్తూ జిల్లా వ్యాప్తంగా డీవైఎఫ్ఐ ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని , మాదకద్రవ్యాలకు యువత బానిస కాకుండా చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని, గంజాయి డ్రగ్స్ వంటి మహం మారిన యువత పడ కుండా అన్ని రకాల సంఘాలను కలుపుకొని సామాజిక కార్యక్రమాలు చైతన్య సదస్సులు నిర్వహిస్తామని నాయకులు తెలిపారు.