బస్తీ దవాఖానా వైద్యురాలిగా వంగాల మేఘన నియామకం

02-11-2026 | 09:29pm

ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

వైద్యురాలు వంగాల మేఘన

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలోని ఎల్బీఎస్ నగర్ బస్తీ దవాఖానా(LBS Nagar Basti Dawakhana)లో వైద్యురాలిగా వంగాల మేఘన(Dr. Vangala Meghana) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్తీ దవాఖానా పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న బస్తీ దవాఖానాను సందర్శించి వైద్య సేవలు పొందాలని విజ్ఞప్తి చేశారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు చేరువగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వంగాల మేఘన కోరారు.

మరిన్ని వార్తలు