సర్పంచుల సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో(Mulakalapalli Mandal) సర్పంచుల సంఘం(Sarpanches Association) నూతన కమిటీని(Committee) ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచులు సమావేశమై ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ వివరాలు:
అధ్యక్షులుగా - తుర్రం శ్రీనివాసరావు (తిమ్మంపేట),
ఉపాధ్యక్షులుగా - మడకం విజయ (రాచన్నగూడెం),
కార్యదర్శిగా - కల్లూరి కిషోర్ (ముత్యాలంపాడు),
సహాయ కార్యదర్శిగా - గంప సుజాత (మాదారం),
కోశాధికారిగా - వాడే రాము (గుట్ట గూడెం) సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
కమిటీ కార్యవర్గ సభ్యులుగా
భూక్య ధర్మ (పూసుగూడెం), ఊకే ఆదిలక్ష్మి (వీకే రామవరం),వగ్గెల రాధ (కమలాపురం),రసపుత్ర తిరుపతమ్మ (రామచంద్రాపురం),సోడే చైతన్య (పాత గంగారం),కోర్సా ఆదిలక్ష్మి (మూకమామిడి), తానం పద్మ (చవిటి గూడెం), మడకం రవి (పొగలపల్లి),గడ్డం సుజాత (తాళ్లపాయి),కారం వెంకటేష్ (పాత గుండలపాడు) సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు తుర్రం శ్రీనివాసరావు,కల్లూరి కిషోర్ మాట్లాడుతూ మండలంలోని సర్పంచులందరం ఐక్యంగా ఉంటూ గ్రామాల అభివృద్ధి కోసం,సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం కలిసి పోరాడుతాము" అని పేర్కొన్నారు.
ఇటీవల కమలాపురం గ్రామంలో జరిగిన సంఘటనపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురం గ్రామ సర్పంచ్ వగ్గెల రాధ లేకుండా,గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.