ఎల్నినో ప్రభావంపై చర్చ
బెల,(విజయక్రాంతి): మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల స్థాయి సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు, నీటి పొదుపు, విద్యుత్ ఆదాపై చర్చించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో నీటిని పొదుపుగా వినియోగించాలని, విద్యుత్ వృథాను అరికట్టాలని సూచించారు.
రైతులకు పశుగ్రాస విత్తనాలను పూర్తి సబ్సిడీపై అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే వీబీజీ రామ్ జీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడం, ఇంకుడు గుంతలు, గ్రామ పంచాయతీ భవనాలు, వీవో భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి మనోహర్, ఎంపీడీవో మహేష్ కుమార్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.