మద్యం దుకాణంపై చర్యలు తీసుకోవాలని ట్రైని కలెక్టర్ ఫిర్యాదు

02-11-2026 | 10:01pm

రాజాపూర్: రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కి హాజరైన ట్రైనీ కలెక్టర్ సాయి శివానికి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాణ్యమైన మద్యం మండలంలోని పలు గ్రామాలకు చెందిన బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. నాణ్యతలేని మధ్యాహ్నం వైన్ షాపులలో వినియోగదారులకు విక్రయిస్తున్నారని తెలిపారు.

నాణ్యమైన మద్యం బాటిల్ కావాలని అడిగినా వినియోగదారులకు మా దగ్గర స్టాక్ లేదని నిర్లక్ష్య వైఖరితో సమాధానం ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి వైన్ షాపులను తాలింపులు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో యాదగిరి,నజీమ్  బేగ్,లింగం, ఆర్ యాదగిరి, వెంకటేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు