ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
– ఐటీడీఏ ఉట్నూర్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జాదవ్ వసంత్ రావు..
ఉట్నూర్ (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ఏపిఓ జాదవ్ వసంత్ రావు(ITDA Assistant Project Officer Jadhav Vasanth Rao) అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జైనూర్ మండలం జంగావ్ గ్రామానికి చెందిన వసంత్ రావు తనకి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామానికి చెందిన ఉమేశ్వరి తనకు నర్సింగ్ ఉద్యోగం ఇప్పించమని కోరారు. గాదిగూడ మండలం లొద్దిగూడ గ్రామానికి చెందిన జ్యోతిబాయ్ తన కు ఏడ్ల జత కల్పించామని విజ్ఞప్తి చేశారు.ఇంద్రవెల్లి మండలం హార్కాపూర్ గ్రామానికి చెందిన రామారావు తన కు ఎడ్ల జత చనిపోయినందుకు దాని బదులుగా ఆర్థిక సహాయం చేయమని మంజూరు కొరకు దరఖాస్తు అందజేశారు.
అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.
ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జాదవ్ వసంత్ రావ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.