6 September, 2026 | 3:14 PM

నీట్ లో 11వ ర్యాంకు సాధించిన జాదవ్ తేజస్వి

06-09-2026 | 01:40pm

గాంధీ మెడికల్ కాలేజీలో సీటు..

అభినందించిన తల్లిదండ్రులు

ఉట్నూర్,సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని(Utnoor Mandal) హస్నాపూర్ పంచాయతీ(Hasnapur Panchayat) పరిధిలోని శ్యాం నాయక్  తండాకు చెందిన గిరిజన బిడ్డ జాదవ్ తేజస్వి ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటారు. ఇటీవలే విడుదలైన నీట్ ఫలితాల్లో ఆమె జాతీయ స్థాయిలో ఎస్టి కేటగిరీలో 11వ ర్యాంకు సాధించారని తల్లిదండ్రులు, టిటిఎఫ్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రవీందర్ జాదవ్ తెలిపారు. ఈ ప్రతిభ ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రముఖ గాంధీ మెడికల్ కాలేజీలో తేజస్వికి ఎంబీబీఎస్ సీటు లభించింది.

ఈమె తండ్రి జాదవ్ శ్రీనివాస్ (గణితం స్కూల్ అసిస్టెంట్)  తల్లి సాధనల దంపతుల కుమార్తె. ఒక సాధారణ ఆదివాసి గిరిజన కుటుంబం నుంచి వచ్చి, కష్టపడి చదివి ఈస్థాయిర్యాంకుసాధించడం పట్ల తెలంగాణ గిరిజన టీచర్స్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు. జాదవ్ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు.గిరిజన ప్రాంత బిడ్డ వైద్య విద్యలో ఇంతటి ఘనత సాధించడం యావత్ గిరిజన సమాజానికే గర్వకారణమని పేర్కొంటూ, తేజస్వికి  ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు