పోసానిపేట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
రామారెడ్డి, సెప్టెంబర్ 07 (విజయ క్రాంతి ) : పోసానిపేట్ గ్రామం(Posanipet Village)లో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ(Ground breaking ceremony) కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులు మంగళారపు రోజా, బండారి లక్ష్మి ఇళ్ల స్థలాల్లో ముగ్గు వేసి, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం, ఉప సర్పంచ్ అంజయ్య, మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోసానిపేట్ గ్రామ(Posanipet Village) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, వి.డి.సి. అధ్యక్షులు గంగారం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని త్వరగా నిర్మించుకోవాలని నాయకులు సూచించారు.






