పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
ఉట్నూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామంలోని అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) మంజూరు చేయాలని గ్రామస్తులు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం (Representation) అందజేశారు.
గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరాపూర్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా దత్తత తీసుకుని, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామస్తుల వినతిపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సానుకూలంగా స్పందించారు. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో (Housing Department) మాట్లాడి అర్హులైన కుటుంబాలకు ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు ఎండీ జహీర్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తమ్, ఎండీ మసూద్, వరుణ్ ఫడ్, హీరాపూర్ పటేల్, మారుతిగూడ పటేల్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.