జనగామకు విద్యాసంస్థలు మంజూరు చేయాలి
సీఎం సలహాదారుకు వినతి
జనగామ, అక్టోబర్ 06 (విజయక్రాంతి): జనగామ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హైస్కూల్(Young India Integrated High School) మరియు కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ నాగరత్న సేవా సంఘం(Nagaratna Seva Sangham) అధ్యక్షుడు బిర్రు ఇస్తారి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
జనగామలో పాఠశాలలకు అవసరమైన కాకతీయ పీజీ కాలేజీ భవనం, 15 ఎకరాల స్థలం, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని, జనగామ వెనుకబడిన ప్రాంతమని, విద్యాసంస్థలు వస్తే జనగామ విద్యాకేంద్రంగా మారుతుందని ఆయన తెలిపారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు జనగామకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు