బి ఆర్ ఎస్ సత్తా చాటుకునేందుకు సిద్ధం

30-10-2026 | 04:21pm

బోథ్. అక్టోబర్ 30 ( విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో(Adilabad district headquarters) బి ఆర్ ఎస్(BRS ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు గర్జన సదస్సు(Farmers' Roar Convention) నిర్వహణకు ఆ పార్టీ తమ సత్తాను చాటుకోవాలని సిద్ధమైంది. నవంబర్ 1న జరిగే కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కేటీఆర్ రానున్నందున బి ఆర్ ఎస్ పార్టీ జన బలం నిరూపించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే బోథ్ బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు జాదవ్ అనిల్ కార్యకర్తలను సమావేశానికి వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు. 

ప్రత్యేక సమావేశం పెట్టి..

రైతు గర్జన సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుండి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చే విధంగా చూడాలని మండల స్థాయి నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 

బలనిరూపణకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు సిద్ధం. 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు గర్జన సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలను తీసుకువచ్చి తమకు ప్రజాబలం ఈ మేరకు ఉందనేది ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న బోత్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను నాయకులను సమావేశానికి భారీ సంఖ్యలో తరలించేందుకు బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సహితం సిద్ధమయ్యారు. మారుమూల గ్రామాల నుండి సైతం కార్యకర్తలను సమావేశానికి హాజరు కావలసిందిగా ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వంపై రైతు వ్యతిరేకత ఏ విధంగా ఉందనేది ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు