విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

25-11-2026 | 01:25pm

ఆదిలాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రావాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా (Protest) నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్ మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్ (Education Scheme) బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు చదువులు కొనసాగించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వారి కుటుంబాలు సైతం ఆర్థిక ఇబ్బందులు (Financial Burden) ఎదుర్కొంటున్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గన్నోజి విజయ్ కుమార్, నాయకులు వేణుగోపాల్ యాదవ్, పవన్ కుమార్, సిడామ్ రాం కిషన్, నరేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు